మృత్యువుతో పోరాడి ఓడిన ఇర్ఫాన్‌ ఖాన్‌

ముంబై: తీవ్ర‌ అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృత్యువుతో పోరాడి శాశ్వతంగా విశ్రాంతి తీసుకున్నారు. పెద్ద‌పేగు సంబంధిత వ్యాధికి ఆయ‌న ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. ఇర్ఫాన్‌ మృతి పట్ల బాలీవుడ్‌ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.  ఆయన ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని, ఇర్ఫాన్‌ కుటుంబానికి సంతాపం తెలిపారు. ఆయన చివ‌రిగా  ‘అంగ్రేజీ మీడియం’ లో ముఖ్యపాత్రలో నటించారు. ప్రారంభంలో బుల్లితెరపై పేరు తెచ్చుకున్న ఇర్ఫాన్‌ ‘సలామ్ బాంబే’ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాగే ‘పాన్ సింగ్ తోమర్’  చిత్రానికి ఉత్తమ నటుడుగా ఆయన జాతీయ అవార్డు అందుకున్నారు.  (ముంబై ఆసుపత్రిలో చేరిన నటుడు ఇర్ఫాన్‌)