వాషింగ్టన్: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ తీవ్రతిప్పుడు అమెరికాలో ఎక్కువైంది. 24 గంటల వ్యవధిలోనే పదివేల కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య 49,594కు చేరుకుంది. ఒకే రోజు 130 మంది మరణించారు. దీంతో అమెరికాలో మృతుల సంఖ్య 622కి పెరిగింది. కోవిడ్ కల్లోలానికి ప్రపంచ వ్యాప్తంగా 16,961 మంది ప్రాణాలు కోల్పోగా, 4 లక్షల మందికిపైగా వ్యాధి బారిన పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద సుమారు 175 దేశాలు, ప్రాంతాలు కరోనా కోరల్లో చిక్కుకున్నాయి.
అమెరికాలో కరోనా విస్ఫోటనం!